ತೆಲುಗು ಹಾಡು - ಪೆಳ್ಳಿ ಸಂದಡಿ ೧೯೯೬ - Pelli Sandadi Telugu - Hrudayamane Kovela హృదయమనే కోవెల తలుపులు

ಇದೊಂದು ತೆಲುಗು ಹಾಡು ಆದರೂ ಕೂಡ, ಚಿತ್ರದ ಮುಗಿಯುವ ಹಂತದಲ್ಲಿ ಬರುವ ಸನ್ನಿವೇಶದ ಹಾಡು ಇಡೀ ಥಿಯೇಟರ್ ನಲ್ಲಿರುವ ಪ್ರೇಕ್ಷಕರನ್ನೆಲ್ಲ ಕಣ್ಣೀರ ಸುರುಸುವಂತೆ ಮಾಡಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮನಗೆದ್ದ ಚಿತ್ರ, ಆದ್ದರಿಂದ ತೆಲುಗು ಹಾಡು ಒಂದನ್ನು ಇಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಅನ್ಯಥಾ ಭಾವಿಸಬೇಡಿ.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారి అమూల్యమైన ఆణిముత్యాలల్లో ఇది కచ్చితంగా ఒక్కటి అని అందరు నమ్ముతారు, ఇప్పటివరకు ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టని సినిమా ఇది. పెళ్లి సందడి అంటే కుప్పలు కుప్పలు కమెడియన్లు , అద్భుతమైన పాటలు, దర్శకేంద్రుడి దృశ్య కావ్యం అని వెంటనే మన మనసుకు వస్తుంది.
ఇలాంటి సినిమాకి, ప్రత్యేకంగా ఈ పాటా కోసం, దాదాపు 22 ట్యూన్ లు చేయించి న తరువాత ఓకే చేసారంట దర్శకేంద్రుడు గారు. అంతగా కీరవాణి గారిని ఇబ్బంది పెట్టినందుకు ఇంత అద్భుతమైన పాత వచ్చింది అని ఇద్దరూ నమ్ముతాం అని ఒక టివి షో లో చెప్పడం జరిగింది.
ఇది హిందోళం తో మొదలయ్యి, చంద్రాకౌంస్ అనే రాగం తో కలుస్తూ మళ్ళీ హిందోళం లోకి వస్తుంది. హిందోళం లో ఉన్నంత సేపు, సంతోష్ భావం ఉట్టి పడేలా చేస్తూ, చంద్రాకౌంస్ రాగంలో వచ్చే సరికి, కాస్త దుఃఖాన్ని వెదజల్లే భావాల్ని కలిగిస్తుంది.
రెండు రాగాలలో ఉండేది "స గ మ ద  ని స" లే  అయినప్పటికీ, చంద్రాకౌంస్ లో పెద్ద ని వాడారు.

Comments